పుష్పలో సమంత పాట విడుదల
2021లో విడుదలై సెన్సేషన్‌గా మారిన ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది. సమంత డ్యాన్స్ చేయడంతో ఈ పాట లిరికల్ వీడియో యూట్యూబ్ రికార్డు బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. విడుదలైన క్షణం నుంచే లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. పూర్తి వీడియో సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అన ఎదురుచూసేలా చేసింది. ఆ క్షణం రానే వచ్చింది. సోషల్ మీడియా వేదికగా ‘పుష్ప’ టీం ఫుల్ వీడియోను విడుదల చేసింది. థియేటర్ లో చూడటం కంటే యూట్యూబ్ లోనే ఈ పాటను మళ్లీ మళ్లీ చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సమంత తన అందచందాలను ఒలకబొస్తు వేసిన స్టెప్పులు కుర్రాళ్లను వెర్రెక్కిస్తున్నాయి. అలాగే పుష్ప పుల్ మూవీ కూడా ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించగా ఓటీటీలోనూ తొలిరోజే దుమ్ముదులుపుతోంది. థియేటర్ లో సినిమా ఆడుతుండగానే ఓటీటీలో రిలీజ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా... ప్రేక్షకులు మాత్రం ఎంజాయ్ చేస్తూ పుష్ప చిత్రాన్ని వీక్షిస్తున్నారు. పుష్ప ది రూల్ కోసం ఎదురుచూస్తున్నారు.
Post a Comment