ఆర్టీవీకి నాని అపాయింట్ మెంట్
వివాదాస్పద చిత్రాల దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని అపాయింట్ మెంట్ ఇచ్చారు. టికెట్ ధరల విషయంలోఇటీవల వీరిద్దరి మధ్య ట్విట్టర్ వార్ నడించింది. పవన్ కల్యాణ్, సంపూర్ణేశ్ బాబు సినిమాలను ప్రభుత్వం ఒకేలా చూస్తుందని వర్మ మండిపడ్డారు. టికెట్ ధర విషయంలో అనుమతి ఇస్తే ప్రభుత్వంలోని ఆర్థిక నిపుణులతో చర్చకు సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవడం మా ఉద్దేశం కాదని, పర్సనల్ గా వైఎస్ జగన్ అంటే నాకు చాలా అభిమామని, కేవలం మా సమస్యలు మేము సరిగా చెప్పుకోలేకపోవడం వల్లో లేక మీరు మా కోణం నుంచి అర్థం చేసుకోకపోవడం వల్లో ఈ మిస్ అండర్ స్టాండింగ్ ఏర్పడిందని నానిని కోరారు. వర్మ రిక్వెస్ట్ పై స్పందించిన మంత్రి పేర్ని నాని ఈ నెల 10న తనను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. జనవరి 10న మధ్యాహ్నాం అమరావతి సచివాలయంలో వర్మ, పేర్ని నానిలు సమావేశం కానున్నారు. టికెట్ ధరలపై పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. టికెట్ ధరల వివాదానికి వర్మ ముగింపు పలుకుతాడా లేక కొత్త సమస్యలేవైనా తీసుకొస్తాడా అని పరిశ్రమ వర్గాలు కలవరపడుతున్నాయి.
Post a Comment