ఇంటికొచ్చిన లైగర్

 

లైగర్ షూటింగ్ వాయిదా

- ఇంట్లో సేదతీరుతున్న విజయ్ దేవరకొండ



పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ లైగర్. ధర్మా ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. మిక్సుడ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని పూరీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల చేస్తున్నామని యూనిట్ ప్రకటించడంతో సినిమా కోసం ఈగర్లీగా అంతా వేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మిగిలిన షూటింగ్ పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయాలని పూరీ పక్కాగా ప్లాన్ చేశాడు. ముంబయిలో ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉండగా అక్కడ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం లైగర్ టీంను కలవరానికి గురిచేసింది. దీంతో అప్రమత్తమైన నిర్మాతలు కరన్ జోహర్, ఛార్మిలు... తమ టీం సభ్యుల ఆరోగ్యం ముఖ్యమని లైగర్ షూటింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. సినిమా షూటింగ్ క్యాన్సిల్ కావడంతో హైదరాబాద్ వచ్చిన విజయ్ దేవరకొండ... ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో సేదతీరుతూ కనిపించారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్న విజయ్... అభిమానుల అంచనాలకు మించి సినిమా ఇవ్వాలని శ్రమిస్తున్నాడు. అందులో భాగంగా కరోనా అడ్డంకులు సృష్టిస్తుండటం ఒకరకంగా విజయ్ కి తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తోంది. 

Post a Comment

Previous Post Next Post