బండ్లకు మూడోసారి కరోనా

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మూడోసారి కరోనా భారినపడ్డారు. ఈ విషయాన్ని గణేశ్ స్వయంగా వెల్లడించారు. "గత మూడు రోజులు దిల్లీలో ఉన్నాను. ఈ సాయంత్రం కొవిడ్​ పాజిటివ్​ వచ్చింది. స్వల్ప లక్షణాలున్నాయి. ప్రస్తుతం ఐసొలేషన్​లో ఉన్నాను. నా కుటుంబానికి మాత్రం నెగిటివ్​ వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసే ముందు ఆలోచించండి." అని బండ్ల తెలిపారు. అలాగే ఇంట్లోనే అపోలో వైద్యులతో చికిత్స తీసుకుంటున్న వీడియోను గణేశ్ అభిమానులతో పంచుకున్నారు.  బండ్ల కరోనా భారినపడటం ఇది మూడోసారి. ఫస్ట్​వేవ్, సెకండ్​ వేవ్​లలోనూ ఆయనకు వైరస్​ సోకింది. తిరిగి కోలుకొని సినిమాల్లో కూడా నటించాడు. గణేశ్ ఏకపాత్రాభినయం చేసిన  "డేగల బాబ్జీ"మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. 

Post a Comment

Previous Post Next Post