సూపర్ స్టార్ మహేశ్ బాబు జీవితంలో హృదయం ద్రవించే సంఘటన ఇది. సొదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు ఆకస్మిక మరణం మహేశ్ ను తీవ్రంగా కలిచివేసింది. తన లైఫ్ లో ఎంతో కీలమైన అన్నయ్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. కరోనా వల్ల నేరుగా వచ్చి అన్నను కడసారి చూడలేని పరిస్థితుల్లో తనలో తనే తీవ్రంగా మదనపడ్డాడు. హోంక్వారంటైన్ లో ఉన్న మహేశ్ ... కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రమేశ్ బాబు వద్దకు రాలేకపోయాడు. మహేశ్ పరిస్థితిని అర్థం చేసుకున్న కుటుంబసభ్యులు...రమేశ్ బాబు డెడ్ బాడీ ఫొటోలు తీసి మహేశ్ కు పంపించారు. వాటిని చూసి మహేశ్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. తిరిగి వాట్సప్ కాల్ చేసి అన్నను కడసారి చూసుకున్నాడు. వదిన, పిల్లలకు ధైర్యాన్ని చెప్పడం కుటుంబసభ్యులను కలిచివేసింది. ఈ హృదయవిదారకర సంఘటన మరే కుటుంబంలో జరగకూడదని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. రమేశ్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాక అన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగంగా ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.
Post a Comment