ఏపీలో కర్ఫ్యూ, సినిమా థియేటర్లపై ఆంక్షలు

 

కరోనా  మూడో ముప్పు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కర్ఫ్యూ పెడుతున్నట్లు వెల్లడించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. సినిమా థియేటర్లపై కూడా ఆంక్షలు విధించింది. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నిర్వహించాలని ఆదేశించింది. అలాగే వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో కూడా జన సామర్థ్యం లేకుండా చూసుకోవాలని సూచించింది. దుకాణాలు, దేవాలయాల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. 


Post a Comment

Previous Post Next Post