సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ తొలగించండిః జాతీయ మహిళా కమిషన్

 

బొమ్మరిల్లు సిద్ధార్థ వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధార్థ స్ర్తీ ద్వేషి అంటూ మండిపడింది. వెంటనే అతని ట్విట్టర్ ఖాతాను నిలిపివేయాలని ఏకంగా ట్విట్టర్ ఇండియాకు లేఖ రాసింది. అంతేకాకుండా సిద్ధూపై కేసు నమోదు చేయాలని మహారాష్ట్ర డీజీపీని మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ ఆదేశించింది. 

    సిద్ధార్థపై ఇంతలా మహిళా కమిషన్ ఆగ్రహానికి ఎందుకు వ్యక్తం చేసిందంటే.... ఇటీవల పంజాబ్ పర్యటనలో ప్రధాని భద్రతా వైఫల్యం బయటపడింది. ఈ విషయంపై ప్రముఖ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ట్వీట్ చేస్తూ... ప్రధాని భద్రత విషయంలో రాజీ పడితే ఏ దేశం కూడా తాము సురక్షితంగా ఉన్నామని చెప్పుకోదని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ప్రధాని మోదీపై అరాచకవాదుల పిరికి దాడిని ఖండిస్తున్నట్లు సైనా పేర్కొంది. సైనా ట్వీట్ చూసిన సిద్ధార్థ... సైనా ట్వీట్ కు రిప్లై ఇస్తూ అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. భారత్ ను రక్షించేవారున్నారని, కాక్ ఛాంపియన్ ఆఫ్ ద వరల్డ్ అంటూ సెటైర్ వేశాడు. సిద్ధార్థ ట్విట్ పై నెటిజన్లు, మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న ట్వీట్ కాస్తా వివాదంగా మారింది. దీంతో స్పందించిన సిద్ధార్థ... తన కామెంట్స్ ను వక్రీకరించారని, కాక్ అండ్ బుల్ కథలు చెప్పారని మరో ట్వీట్ వేశాడు. తాను సైనా నెహ్వాల్ ను అగౌరపర్చలేదని, తన ఉద్దేశం అది కాదని వివరణ ఇచ్చాడు. సిద్ధార్థ రిప్లై కూడా సైనా స్పందించింది. సిద్ధార్థను నటుడిగా ఇష్టపడతానని, తన కామెంట్స్ సరైన రీతిలో లేవని అసహనం వ్యక్తం చేసింది. సరైన పదాలు ఉపయోగించి మాట్లాడాలని కోరారు. 

Post a Comment

Previous Post Next Post