మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూత


ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు(56) కన్నుమూశారు. కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు... హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఫిల్మ్ నగర్ లోని నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలింగా వైద్యులు రమేష్ బాబు మరణించినట్లు నిర్ధారించారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రంతో తెరకు పరిచయమైన రమేష్ బాబు 15 చిత్రాల్లో నటించారు. తన సోదరుడు మహేశ్ బాబుతో అర్జున్ , అతిథి, దూకుడు, ఆగడు చిత్రాలను నిర్మించారు. రమేష్ బాబు నటించిన చివరి చిత్రం ఎన్ కౌంటర్ . ఈ చిత్రంలో సూర్యం పాత్రలో నటించారు. రమేష్ బాబు నటించిన చిత్రాల్లో బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు తనకు మంచి పేరు తీసుకొచ్చాయి. రమేష్ బాబుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 

Post a Comment

Previous Post Next Post