తెలుగు సినీ పరిశ్రమలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నటకిరిటీ రాజేంద్రప్రసాద్ కరోనా భారినపడ్డారు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా స్వల్పంగా కొవిడ్ నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా గచ్చిబౌళిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన రాజేంద్రప్రసాద్ ... నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అయితే రాజేంద్రప్రసాద్ ఆరోగ్యం పూర్తిగా నిలకడగానే ఉందని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. మరోవైపు ఇప్పటికే కరోనా భారినపడిన సూపర్ స్టార్ మహేశ్ బాబు సహా ఇతర నటీనటులంతా హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. వరుసగా సినీ పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సినిమా షూటింగ్ లను, వేడుకలను దర్శక నిర్మాతలు తాత్కాలికంగా వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా భారిన నటకిరిటీ
Blogger VJ
0
Post a Comment