మనసుకు తగిలిన గాయం త్వరగా మానదు : సమంత

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తన జీవితాన్ని స్వేచ్ఛగా మలుచుకుంది స్టార్ హీరోయిన్ సమంత. ఫ్రెండ్స్ తో లాంగ్ డ్రైవ్స్ , టూర్స్ కు వెళ్తూ వివాహ బంధం చేసిన గాయం నుంచి క్రమంగా కుదుటపడుతుంది.  ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ప్రముఖ స్వచ్చంద సంస్థ రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన  సైకియాట్రి ఎట్  యువర్ డోర్ స్టెప్ కార్యక్రమంలో సమంత పాల్గొంది. తన జీవితంలో ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నానని తెలిపిన సమంత.... స్నేహితులు, వైద్యుల సహాయం వల్ల ధైర్యంగా నిలబడగలుగుతున్నానని తెలిపింది. శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను సంప్రదించినట్లుగానే మనసుకి గాయం అయినప్పుడు కూడా సంబందిత మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలని సమంత కోరింది. ప్రస్తుతం సమంత నటిస్తున్న యశోద సినిమా రెండో షెడ్యూల్ జరుపుకుంటుండగా గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న శాకుంతలం మూవీ పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో హాలీవుడ్ చిత్రంలోనూ సమంత తీరిక లేకుండా ఉంది. చైతు గురించి, అక్కినేని ఫ్యామిలీ గురించి ఆలోచించేంత తీరిక లేకుండా తన షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంది సమంత. 

Post a Comment

Previous Post Next Post