కరోనా భారిన కట్టప్ప, ఆస్పత్రికి తరలింపు

కరోనాకు చిక్కుతున్న అగ్ర తారలు

- విదేశీ ప్రయాణాలే కారణం

సినీపరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. టాలీవుడ్ , బాలీవుడ్ , కొలీవుడ్ లో పలువురు అగ్ర నటీనటులు వరుసగా వైరస్​ బారిన పడుతున్నారు. తాజాగా సీనియర్​ నటుడు సత్యరాజ్​కు కొవిడ్​ సోకింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అంతకుముందు తమిళ చిత్రసీమలో కమెడియన్​ వడివేలు, చియాన్​ విక్రమ్​, వరలక్ష్మీ, అర్జున్​, కమల్​హాసన్, త్రిష​, అరుణ్ విజయ్ , మీనా తదితరులు కరోనా బారిన పడగా.. టాలీవుడ్​లో మహేశ్​బాబు, మంచు మనోజ్​, మంచు లక్ష్మీ, తమన్ , విశ్వక్ సేన్ వైరస్​ బారిన పడ్డారు. వరుసగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కరోనా కేసులు బయటపడుతుండటంతో డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ లు వాయిదా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఫస్ట్ వేవ్ , సెకండ్ వేవ్ ల కన్నా చిత్ర పరిశ్రమకు ఈ మూడో వేవ్ మరింత నష్టాన్ని తీసుకొచ్చేలా కనిపిస్తుంది.

Post a Comment

Previous Post Next Post