తేలిగ్గా తీసుకోవద్దు.. జాగ్రత్తగా ఉండండి

ఓమిక్రాన్ కు తేలిగ్గా తీసుకోవద్దు

- మాస్క్ తప్పనిసరి ధరించండి



ప్రపంచాన్ని మరోసారి వణికిస్తోన్న కరోనా వేరియంట్ ఓమిక్రాన్ ను ప్రజలు తేలికగా తీసుకోవద్దని ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ సూచించారు. అయితే ఇప్పుడు నమోదవుతున్న అన్ని కేసులు ఓమిక్రాన్ కాదని, చాలా వరకు డెల్టా వేరియంట్ భారిన పడుతున్నారని తెలిపారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతోపాటు థమన్ మరికొంత మంది సినీ ప్రముఖులు, జర్నలిస్టులకు కరోనా నిర్దారణ కావడంతో ఆందోళన వ్యక్తం చేసిన హరీశ్ శంకర్ ... వారంతా త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించారు. అయితే ఓమిక్రాన్ వల్ల స్వల్ప లక్షణాలే కనిపించినా తేలిగ్గా తీసుకోవద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని హరీశ్ కోరారు. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని హరీశ్ శంకర్ ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులు, అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.


Post a Comment

Previous Post Next Post