అది తీసుకోవడం వల్లే నేను బతికాను


ప్రముఖ సినీ నటి త్రిష పెను ఆపద నుంచి బయటపడింది. 2022లోకి అడుగుపెట్టేవారం రోజుల ముందు కరోనా భారినపడింది. అప్పటి నుంచి తీవ్రంగా ఇబ్బందిపడిన త్రిష... కుటుంబసభ్యుల సహకారం, అభిమానుల ప్రార్థనల వల్ల ఈరోజు కోలుకున్నట్లు తెలిపింది. తనను కరోనా నుంచి రక్షించింది వ్యాక్సినేనని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది. ఇటీవల 96చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న త్రిష... ఆచితూచి సినిమాలు చేస్తోంది. మణిరత్నం పొన్నియన్ సెల్వమ్ పార్ట్ 1లో  నటించింది. ఆ మూవీ విడుదల కావాల్సి ఉంది.  ఇటీవలే దుబాయ్ కి గోల్డెన్ వీసా పొందిన తొలి తమిళ నటిగా త్రిష గుర్తింపు పొందింది. 

Post a Comment

Previous Post Next Post