పెద్దమ్మాయిలను ప్రేమించొద్దని రాజ్యాంగంలో రాసుందా.... "రౌడీబాయ్స్" ప్రశ్న

 



ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లైన దిల్ రాజు, శిరీష్ లు తమ నటవారసున్ని తెలుగు తెరకు పరిచయం చేస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. శిరీష్ తనయుడు అశీష్ హీరోగా నటించిన ఈ మూవీ జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా రౌడీ బాయ్స్ ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. 2 నిమిషాల 25 సెకన్లు కట్ చేసిన ట్రైలర్ ఎలా ఉందంటే... " కాలేజీ చదువులు, ప్రేమలు, గొడవలతో నిండిపోయింది. లెగసీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చదువుతున్న అక్షయ్ ... బ్రహ్మా మెడికల్ కళాశాలలో చదువుతున్న కావ్య(అనుపమ పరమేశ్వరన్) ను ప్రేమిస్తాడు. కావ్య అక్షయ్ కంటే వయస్సులో  రెండేళ్లు పెద్దది. అయినా వారిద్దరు ప్రేమలో పడతారు. అక్షయ్ తో కావ్య చనువుగా ఉండటం ఇష్టం లేని విక్రమ్ గొడవలకు దిగాడు. అక్షయ్ , విక్రమ్ ల మధ్య గొడవలు రెండు కాలేజీల మధ్య తారస్థాయికి చేరుతాయి. ఈ క్రమంలో ఆ గొడవలు ఎలాంటి పరిస్థితులకు దారితీసాయి, అక్షయ్  ప్రేమను కావ్య అంగీకరించిందా లేదా అనేదే రౌడీ బాయ్స్ కథ "గా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాలేజీలో ఏముంటుందిరా అంటూ ఆసక్తిని కలిగించి... మనకంటే పెద్దమ్మాయిలను లవ్ చేయవద్దని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా లాంటి మాటలు యువతను తెగ ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా అనుపమ ఆశీష్ మధ్య రొమాంటిక్ సీన్స్ కుర్రకారును థియేటర్ కు రప్పించేలా ఉన్నాయి. ఇకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ ఓసారి చూసేయండి. నచ్చితే సినిమాకు రెడీ అయిపోండి. 

                                కానీ కాస్తా జాగ్రత్త. మాస్క్ ధరించండి. కొవిడ్ ను దూరం పెట్టండి. 

Post a Comment

Previous Post Next Post