కోవిడ్ కారణంగా హోంక్వారంటైన్ లో ఉన్న మహేశ్ బాబు తన సోదరుడు రమేశ్ బాబు కడచూపునకు దూరమయ్యారు. రమేశ్ బాబు ఆకస్మిక మరణం పట్ల ఎంతో భావోద్వేగానికి గురైన మహేశ్ బాబు... ట్విట్టర్ వేదికగా రమేశ్ బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తుది వీడ్కోలు పలికారు.
రమేశ్ బాబు లేకుంటే తాను ఇప్పుడు ఈ స్థితిలో ఉండేవాడిని కాదని వ్యాఖ్యానించిన మహేశ్... తనే నాకు స్ఫూర్తి, బలం, ధైర్యం, సర్వస్వమని పేర్కొన్నారు. తనకు మరో జన్మంటూ ఉంటే రమేశ్ బాబే అన్నయ్యగా ఉండాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తన కోసం ఎంతో చేసిన రమేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపిన మహేశ్.... ఎల్లప్పుడు రమేష్ ను ప్రేమిస్తూనే ఉంటానని ట్విట్టర్ వేదికగా పేర్కొంటూ సోదరుడిపై ప్రేమను చాటుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని సామాజిక మాద్యమాల్లో మహేశ్ బాబు అభిమానులు కూడా భావోద్వేగంగా పోస్టులు పెడుతూ ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు.
Post a Comment