ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ పంజా విసురుతున్న వేళ... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమలో కొవిడ్ కేసులు సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఆందోళన వ్యక్తం చేసిన ఎన్టీఆర్.... కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. సెకండ్ వేవ్ లో ఎన్టీఆర్ కూడా కరోనా భారినపడి కోలుకున్నారు. ఈ క్రమంలో ఆ బాధలేంటో తెలిసిన వ్యక్తిగా స్పందించిన తారక్... ప్రజలంతా అప్రమత్తంగా ఉండి భౌతిక దూరం పాటిస్తూ కొవిడ్ ను దరిచేరనీయవద్దని సూచించారు. తప్పకుండా ప్రజలందరు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.
Post a Comment