రౌడీబాయ్స్ ప్రేమదేశాన్ని గుర్తుచేసిందిః తారక్

 

- రౌడీబాయ్స్ ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్

- దిల్  రాజు సోదరుడు శిరీష్ కుమారుడు అశీష్ హీరోగా రౌడీబాయ్స్

- జనవరి 14న రౌడీబాయ్స్ విడుదల

ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలను థియేటర్లలోనే చూసి తెలుగు సినీపరిశ్రమను ఆదుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. కొత్త చిత్రాలను, నటీనటులను ప్రోత్సహించే గొప్ప మనసు తెలుగు ప్రేక్షకులకు ఉంటుందన్న తారక్... దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న రౌడీ బాయ్స్ సినిమా ట్రైలర్ ను జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో లాంఛనంగా విడుదల చేశారు. రౌడీబాయ్ చిత్రం ప్రేమదేశం రోజులను గుర్తు చేసిందని, తప్పకుండా విజయం సాధిస్తుందని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు, శిరీష్ లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఎన్టీఆర్... కథానాయకుడిగా పరిచయం అవుతున్న అశీష్ నటుడిగా ఎన్నో మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలంతా కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. 

ఇంకా తారక్ ఏమన్నారంటే.... " అందరికి నమస్కారం. ఈరోజు నాకు చాలా నాస్టాలిక్ డే నాకు. రాజన్న, శిరీష్ అన్నతో నాకు ఆది చిత్రం అప్పటి నుంచి పరిచయం. అప్పుడు అశీష్ ఇంకా పరిచయం కాలేదు. బహుశా చిన్నపిల్లాడేమో.(దిల్ రాజు కలగజేసుకొని అప్పుడు వాడికి 21 ఏళ్ల ఉంటాయి)(నవ్వులు). తను చిన్నపిల్లాడు ఇప్పుడు సినిమా చేస్తున్నాడంటే నన్ను నేను ముసలోడ్ని చేసుకున్నట్టు అవుద్ది(దిల్ రోజు మరోసారి జోక్యం చేసుకొని లేదు.. లేదు... వాడు నీకు ఇప్పుడు బ్రదర్ ). బట్ స్టిల్ నాకు నాస్టాలిక్ గా ఉందని అందుకే చెప్పాను. ఈ రోజు మా శిరీషన్న కొడుకు ట్రైలర్ ను లాంచ్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వాళ్లిద్దరితో ఉన్న జర్నీని నెమరువేసుకోడానికి ఇదొక మంచి ప్లాట్ ఫాంలాగా దొరికింది. థాంక్స్ టూ అశీష్, శ్రీహర్ష. అశీష్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడితే ఎక్కువగా నా ఇంట్లో వ్యక్తి గురించి నేనే ఎక్కువ చెప్పుకున్నట్లు ఉంటుంది. బట్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆశీష్. ఎన్నో చిత్రాలు ఇంకా చేయాలి. ఎన్నో మంచి మంచి చిత్రాల్లో భాగం కావాలని ఆ దేవుడ్ని మనసారా కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు చాలా ఇంపార్ట్ టెంట్ వ్యక్తులు వీళ్లు. రాజన్నతో నాకు ఎంతసేపు స్క్రిప్ట్ లు, ఆన్ సెట్ చర్చలు జరుగుతాయి. శిరీషన్నతో ఎక్కువగా సరదాగా ఉంటుంది. శిరీషన్న నవ్వు ఎప్పుడు అలాగే ఉండాలంటే అశీష్ బాగుండాలి. రౌడీబాయ్స్ చిత్రం ఘన విజయం సాధించాలని, ఇప్పుడు ఉన్న కొవిడ్ పరిస్థితుల్లో కూడా ఒక మంచి చిత్రంగా మనందరికి ఆహ్లాదకరంగా ఉండాలని ఆశిస్తున్నా. శ్రీహర్ష కలిసినప్పుడు చెప్పా. హుషారు చిత్రంలో ఉండిపోరాదే పాట ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంటుంది. ట్రైలర్ చూసినప్పుడు ప్రేమదేశం సినిమా ఫీలింగ్ వచ్చింది. మీ అందరికి కూడా అదే భావన కలుగుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే కొత్త చిత్రాలను కొత్త నటీనటులను  ప్రోత్సహించే గొప్ప హృదయం ఉన్న ప్రేక్షక దేవుళ్లు మన తెలుగువాళ్లు. ఈ చిత్రాన్ని దయచేసి థియేటర్ లోనే చూడండి. థియేటర్ లో సినిమా అనుభూతిని పొంది తెలుగు సినీ పరిశ్రమను ఆదుకోవాలని, కొత్త తరం నటీనటులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నా".

                                                                                            - ఎన్టీఆర్ 


Post a Comment

Previous Post Next Post