హీరో అవుదామనుకున్నవాళ్లు చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు

 


సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రం హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ను దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు. జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హీరో ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. సినిమా బ్యాక్ డ్రాప్ లో సాగే పుల్ యాక్షన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ డ్రామాగా శ్రీరామ్ ఆదిత్య హీరోను మలిచినట్లుగా తెలుస్తోంది. గల్లా అశోక్ కు సరిగ్గా సరిపోయే కథలాగే కనిపిస్తోంది. హీరోయిన్ నిధి అగర్వాల్ తండ్రిగా జగపతిబాబు, హీరో తండ్రిగా నరేష్ చెప్పే సంభాషణలతోపాటు హీరో తల్లికి తన కొడుకు హీరో అవ్వాలనే ఆతృత ఎలా ఉంటుందో చూపించాడు. అలాగే హీరో అవుదామనుకున్నవాళ్లు చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారంటూ చెప్పే సంభాషణలు హీరోకు ఎలాంటి సవాళ్లు ఎదురుకాబోతున్నాయో అర్థమవుతోంది. వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ లు కావల్సినంత కామెడీ పంచేందుకు సిద్ధంగా ఉన్నారు. క్రియేటివ్ పీపుల్ ఎప్పుడు పడితే అప్పుడు కథలు చెప్పరంటూ అశోక్ చెప్పిన డైలాగ్... ఇంట్రెస్టింగా ఉంది. 

Post a Comment

Previous Post Next Post